మాములుగా అందరు జీవితం అందంగా ఉండాలని తమ కళలు నెరవేరాలని కోరుకుంటారు కానీ ఆ కలలన్ని నిజమైతే అది జీవితం ఎందుకు అవుతుంది....... విధి అనబడే ఒక వింత జంతువు మనతో ఆడుకుంటూ ఉంటుంది అలా విధి ఆడిన ఒక గేమ్
"నా జీవితం"
నేను పుట్టింది ఒక చిన్న గ్రామం లో ఐన పెరిగింది మాత్రం మెట్రో నగరం అయిన బెంగుళూరులో నా చదువు అంత అక్కడే సాగింది కాని నాకు ఇంతవరకు ಕನ್ನಡ రాదు ఎందుకంటే అక్కడ కూడా నేను చదివింది తెలుగు పాటశాల లోనే కాబట్టి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాములుగా అమ్మాయిలంటే పిచ్చి ఎందుకంటే ఏమి చెబుతాం కుక్క కి బిస్కెట్ లు ఎందుకు ఇష్టం అంటే ఎం చెబుతారు? అలాగే నాకు కుడా అమ్మాయిలంటే..... నా మొదటి ప్రేమ ఐశ్వర్య తో నా 4 వ క్లాసులో మొదటి సారి తనని చూసినప్పుడు రెండు జడలు చిన్న గౌను ఇంకా వైట్ టీషర్టు నేను ఇప్పటికి బాధ పడుతుంటాను ఎందుకంటే అప్పుడు వేసుకున్న డ్రెస్ ఇప్పుడు వేసుకోవడం లేదు....... మొత్తానికి నా ఫస్ట్ లవ్ ఐశ్వర్య కి ఒక నెల తర్వాత ప్రపోస్ చేశా కష్టపడి తను ఒప్పుకుంది కలిసి ఇసుక లో గుడిలు కూడా కట్టుకున్నాం మీకీ డౌట్ రావచ్చు చీప్ గా గుడిలు ఏంటి అని ఆ వయసులూ అంత కన్నా ఎం చేస్తాం చెప్పండి.....??? ఇంతవరకు అంతా బాగానే ఉంది ఇప్పుడే స్టొరీ లో నా ఫ్రెండ్ ఎంటర్ అయ్యింది అదే విధి [ఫ్రెండ్ అని ఎందుకు అన్నాను అంటే నా జీవితాంతం నన్ను నడిపించేది అదే కాబట్టి]...... మాములుగా నాన్నలకి ట్రాన్స్ఫర్ వస్తుంది కానీ అదేంటూ నా కర్మ నాన్న మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కి సారీ fraction రాజధాని కి అనంతపూర్ కి......
ఇక అప్పటి నుంచి బెంగుళూరు కి వెళ్ళలేదు నాన్న గారే తరచు వచేవారు క్షణాలు, నిముషాలు, రోజులు,నెలలు,సంవత్సరాలు గడిచాయి కాని నేను ఇంకా ఐష్ ని మర్చిపోలేదు బట్ intelligence వర్గాల సమాచారం ప్రకారం తనే మూడు సంవత్సరం తర్వాత ఒక అబ్బాయి తో లవ్ లో పడింది actual గా ఆ మరుసటి రోజు బెంగుళూరు కి వెల్దం అనుకున్నా కానీ ఆ వార్త వినగానే గుండె తరుక్కు పొయింది 7 th క్లాసు కే నేను దేవదాస్ అయిపోయాను..........................
ఇంకా ఉంది..........
No comments:
Post a Comment